. . . కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మాదిగల ధర్నా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
40 సంవత్సరాల నుంచి 856/9 సర్వే నెంబర్ లో దోమకొండ కళావతి కి ప్రభుత్వ వారు కేటాయించిన భూమిలో 35 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి డెవలప్ చేస్తే అప్పుడు ఆ భూమి మీద కాదు మీరు వెళ్లిపోండి మాదిగలను వేధిస్తున్న గన్నారం గ్రామ అభివృద్ధి కమిటీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం గన్నారంలో గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళ అరాచకాలకు బలవుతున్న మాదిగ కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి పెద్ది వెంకట్రాములు., జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు. మాట్లాడుతూ…. 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి భూమి కేటాయిస్తే అందులో పేదల వేసుకున్న బోరును నాటిన పండ్ల చెట్లు గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు ధ్వంసం చేసి. కొంతమందిని భౌతికంగా గాయపరిచారు. దీనికి అంతటికి కారణం ఆ గ్రామ మాజీ సర్పంచ్., ప్రస్తుత వి డి సి చైర్మన్ కుంట మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు వీడీసీ చట్ట వ్యతిరేకమని అన్న ఈననే ఇప్పుడు వీడి సి చైర్మన్ అవతారం ఎత్తి కొంతమంది లంపెన్ గ్యాంగ్ ను తయారు చేసుకుని మాటిమాటికి దళితులపై దాడి చేయడం, లంచాలు తినబెట్టి అధికారులను కట్టుకోవడం, అధికారులతో దళిత మాదిగ ల పైన ఒత్తిడి చేర్చడం సిగ్గుచేటు అన్నారు.

856 సర్వే నెంబర్ లో 166 ఎకరాలు ఉంటే… 34 ఎకరాలు మాత్రమే పంచి పట్టాలిచ్చారు ఇంకా 132 ఎకరాలు ఉన్నది అన్నమాట. ఎవరికీ ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా కేటాయించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కుంట మోహన్ రెడ్డి ఇంకా అగ్రవర్ణ రెడ్డిలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చట్ట వ్యతిరేకంగా పేదలకు వర్తించాల్సిన భూమిలో పాగా వేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. బరితెగించిన కుంట మోహన్ రెడ్డి చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ నేనే వీటన్నిటికీ కర్త కర్మ క్రియ లంటూ ప్రభుత్వ భూమిని వెంచర్ చేసి, లేఅవుట్ చేసి ప్లాట్లు రూపంలో డబ్బులు పోసుకుంటున్నాడు. ప్రభుత్వ భూములు లేఅవుట్ చేస్తా ఉంటే ఎమ్మార్వో కి కనిపిస్త లేదా అని అడుగుతా ఉన్నాం . అంతేకాదు ప్రైవేట్ భూమిని., ప్రభుత్వ భూ మైన లే అవుట్ ప్లాన్ ఇచ్చే అధికారం ఎమ్మార్వో ఉంటుంది. మరి అసైన్మెంట్ భూమిలో ఎందుకు ఇచ్చారు అని అడుగుతా ఉన్నాం . మీరు ఇవ్వనట్టయితే వెంటనే ఆ భూమిని సీజ్ చేసిన ప్లాట్లు అర్హులైన దళిత, గిరిజన, బీసీ వర్గాలకు మరియు అత్యంత పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది . ఈ మేరకు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించగా ఆమె అనుకూలంగా స్పందించారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే సమరశీల ఉద్యమాల కైనా వెనకాడమని హెచ్చరించారు.