ర్యాగింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్, బతుకమ్మ : మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటనను ఖండిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే మెడికోపై పీజీ మెడిసిన్ చేస్తున్న సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, భౌతిక దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితుడిని మభ్యపెట్టి విషయాన్ని సర్దుమనిగేలా చేసే ప్రయత్నాలు మానుకొని, ర్యాగింగ్, దాడి చేసిన సీనియర్లపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం శిక్షించాలని...