ఇల్లు కూలిన బాధిత కుటుంబానికి తోర్తి సర్పంచ్ ఆర్థిక సాయం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం, గ్రామ పంచాయతీ తరఫున ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన బోడ మీది మల్కాయి కుటుంబం వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం తరఫున రూ.3,200 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా తోర్తి గ్రామ పంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ కౌడ భూమేష్ బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా...