భూ భారతి అర్జీలపై పక్కాగా క్షేత్రస్థాయి విచారణ
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మెండోరా, బతుకమ్మ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం కింద దాఖలైన దరఖాస్తులను నిశితంగా పరిశీలన జరుపుతూ, పక్కాగా క్షేత్రస్థాయి విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మెండోరా మండలంలోని అన్ని గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులు, ప్రజల నుండి భూ సంబంధిత అంశాలపై అర్జీలు స్వీకరించిన విషయం విదితమే. ఈ...