ఈ సారి వచ్చింది 279.354 టీఎంసీలు.. వదిలింది 206.254 టీఎంసీలు..
బతుకమ్మ, మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి జూన్ మొదటి నుండి ఇప్పటివరకు 279.354 టిఎంసిల నీరు వచ్చి చేరింది. గోదావరిలోకి, కాలువల ద్వారా, వరద కాలువ ద్వారా వదిలిన నీరు 206.254 టీఎంసీలుగా అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలు కడగా ఉంది. సోమవారం సాయంకాలం వరకు 1091.00 అడుగులు 80.501 టిఎంసిల నీరు నిల్వ ఉంది.