ఇదేం సెక్షన్ మార్పులు

ముదుర్లకు పెద్దపీట వేతనాలు అడిగినందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బలి? బల్ధియాలో సెక్షన్ల మార్పిడిపై చర్చ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల జరిగిన సెక్షన్ల మార్పిడిపై చర్చ జరుగుతుంది. పైకి మాత్రం స్థానిక అవసరాల కారణంగానే సెక్షన్లను మార్పిడి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కారణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పెంచకపోగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర సెక్షన్లకు స్థానచలనం చేయడంపై బల్ధియాలో చర్చ మొదలయింది. అంతేగాకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...