- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ, కోటగిరి: అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ బిడ్డలు విద్యా రంగంలో పోటీపడేలా,భావితరాల అభ్యున్నతికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ప్రపంచంతో పోటీ పడేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కొన్ని నెలలలోనే అందుబాటులోకి రానున్నాయని జహీరాబాద్ ఎంపీ.సురేష్ షేట్కర్ పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆరకోర నిధులతో ఇలాంటి బృహత్కరమైన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు.అత్యు న్నత ప్రమాణాలతో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యాబోధన ఈ పాఠశాల లో లభిస్తుందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పేర్కొ న్నారు.సోమవారం బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం పి.ఎస్.ఆర్.నగర్ గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు లు,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పోచారం,కాసుల,షేట్కర్,మహాతో మాట్లాడుతూ.మంజీరా పరివాహక ప్రాంతమైన పిఎస్ఆర్ గ్రామంలో విభిన్న సంస్కృతులు కలిగిన వ్యక్తుల ఉండటం వారి మధ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు క్వాలిటీ విద్యను ఇవ్వాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు.మరికొన్ని నెలలలో ఈ పాఠశాల పేద విద్యార్థుల వినియోగానికి దోహదపడాలని అన్నారు.సుమారు 25 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ భవనాలు, తరగతి గదులు,ప్రయోగ శాలలు, ఆటస్థలాలు,హాస్టల్ భవనాలు,సిబ్బందికి నివాస సముదా యాలు,డిజిటల్ తరగ తులు,కంప్యూటర్ ల్యాబ్ లు,వివిధ క్రీడలకు ప్రత్యేక క్రీడ మైదానాలు, వ్యాయామ శాలలు,గ్రంథాలయం,డైనింగ్ హాల్ తదితర అన్ని హంగులతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా భవనాలను నిర్మించనున్నారనీ.పిఎస్ఆర్ నగర్ కి ఇంత గొప్ప పాఠశాల రావడం పట్ల ఇరువురు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పలు రకాల సంక్షేమ పథకాలు అనగా ఉచిత బస్సు ప్రయాణం,ఇందిరమ్మ ఇండ్లు,ఉచిత డ్వాక్రా రుణాలు,మహిళ పారిశ్రామిక ప్రోత్సాహకాలు,మహిళ ఐకెపి సెంటర్ల నిర్వహణ,చీరల పంపిణీ వంటి చేపడుతున్నాయని అన్నారు.రైతులకు బోనస్,కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యానికి డబ్బుల చెల్లింపు వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తూ సన్న బియ్యా న్ని పంపిణీ అందించడం జరుగుతుం దన్నారు.ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం కాకుండా పేదలకు నష్టం కలిగించకుండా రాజధానిలో హైడ్రా విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు.బాన్సువాడ నియోజకవర్గం ఒక విద్య హబ్గా కొనసా గుతుందని.నియోజకవర్గంలో 31 రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూ ట్ లు ఉన్నాయ ని ప్రజలందరూ వీటిని వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.కాకతీయుల కాలంలో రూపొందిన చెరువులు, ఆలయాలు,విద్యావ్య వస్థలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో పోతంగల్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు,తాజా మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్,మాజీ మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,కొట్టం మనోహర్, ఉమ్మడి మండల ఎమ్మార్వో గంగాధర్, కోటగిరి,పోతంగల్ ఎంపీడీవోలు విష్ణు, చందర్ నాయక్,నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలకు చెందిన మాజీ జెడ్పిటిసిలు,ఎంపీపీలు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,ఎంపిటిసిలు,సర్పంచు లు,వార్డ్ నెంబర్లు,రుద్రూర్,వర్ని,చందూ ర్,మోస్రా,బాన్సువాడ మండలాల ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికా రులు,మహిళలు,పిఎస్ఆర్ నగర్ ప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
