Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 9:20 pm Posted by : ramakrishna

రాజ్యాంగం వల్లే ఇంత గౌరవం దక్కింది

  • వాడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

 

బతుకమ్మ :  నాగిరెడ్డిపేట  : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల జాతులకు గౌరవం దక్కిందని పలువురు వ్యక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని వాడి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరు వాడని, కొందరు వాడేనని అంటగట్టడం సరైన పద్ధతి కాదని ఆయన రాసిన రాజ్యాంగం వలనే నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.  అదే స్ఫూర్తితో అనేక రకాలుగా అన్ని వర్గాల జాతులకు రిజర్వేషన్లు దక్కాయని అన్నారు. ఒకనాడు దళితులకే పరిమితమైన అంబేద్కర్ నేడు అన్ని జాతుల వారు రాజ్యాంగ స్ఫూర్తితో కొలుస్తున్నారని జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు, ఓటు హక్కు తదితర హక్కులను ప్రతి మనిషికి కావాలని నినాదించి నిలబెట్టిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన జీవిత చరిత్ర ఒక పాటమని ఆ పాఠాన్ని చదివే ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచేలా చూడాలని ముఖ్యంగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు క్యాతం సిద్ధిరాములు, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగాధర్, రిటైర్డ్ మండల విద్యాధికారి పోచయ్య, మాజీ జెడ్పిటిసి జయరాజ్, నీరుడి రాజు, నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మిద్దె బాబురావు, ఆత్మకూరు బాబురావు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి, తొంట సాయిలు, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.