- తెలంగాణ జాగృతి నాయకురాలు తేలు సరిత పాటిల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణలో ఆడబిడ్డని బతుకమ్మల గౌరమ్మల గౌరవిస్తాం, ఆడపిల్లని ఆదిపరాశక్తిగా పూజిస్తూ తల్లిగా చెల్లిగా పూజిస్తూ ఎంతో గౌరవిస్తాం పూజించే సాంప్రదాయం ఉందని తెలంగాణ జాగృతి నాయకురాలు తేలు సరిత పాటిల్ అన్నారు. బీసీల పట్ల కొట్లాడుతూ బీసీల కోసం నిరంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక గొంతు ఎత్తిందన్నారు. బీసీ బిడ్డ బీసీల కోసమే మాట్లాడాలని ఎక్కడ రాసి పెట్టింది రాజ్యాంగంలో లేదని బీసీల పట్ల నిలబడి బీసీల కోసం నిలబడి నిరంతరం కొట్లాడుతూ నిరంతరం అండదండగా ఉండి విజయవంతం చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంటే రంగులు పూసుకున్నదని మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.