. . . సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని కోతలను రద్దు చేయాలి
. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించకుండా, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ప్రీమియం వసూలు చేయడం, పథకం పై పూర్తి సమాచారం ఇవ్వకుండా జీతాల్లో కోత విధించడం అన్యాయమని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఈ హెచ్ ఎస్ చందా 1.5% మినహాయింపు పై జీవో ఇవ్వకుండా ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈ హెచ్ ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల వేతనాల్లో కోత విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్డు ఇయ్యకుండానే కటింగ్ చేయడం పై ఉద్యోగులు ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలిపి వేయాలని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.