ప్రభుత్వ మనుగడ కోసమే ఈ తతంగం..!

విగ్రహల మార్పు ఏ చట్టంలో ఉంది..? మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు.. ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాల మార్పు కార్యక్రమాన్ని చేపట్టిందని బీఆర్ఎస్ నాయకులు మండి పడ్డారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే తెలంగాణ తల్లి...