నేటి నుండి మూడవ విడత నామినేషన్ల స్వీకరణ
అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: గ్రామ పంచాయతీ మూడవ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని మండలాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ సజావుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల (డిసెంబర్) 3 నుండి 5వ తేదీ వరకు మూడవ విడతగా ఆర్మూర్ డివిజన్...