. . .మెడికల్ షాపులే టార్గెట్
. . . నాలుగున్న లక్షల నగదు
. . . ఎలక్ట్రానిక్ పరికరాల దొంగతనం.
ఆర్మూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి నగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని మూడు వ్యాపార సముదాయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. నాలుగు లక్షలన్నర నగదు ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు.

ఐదుగురు గుర్తు తెలియని దొంగలు ముసుగులు ధరించి షట్టర్లను పగలగొట్టి లోనికి ప్రవేశించినట్లు సిసి టివి పుటేజీలలో స్ఫష్టంగా కనిపించింది. బుదవారం ఉదయం చోరి విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి ప్రొబిషనరీ ఎస్పి సాయికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్మూర్ పోలిస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో చోరిలు జరుగడం పోలిసులకు సవాల్ గా మారింది.
