ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని మూడు వ్యాపార సముదాయాల్లో చోరీకి పాల్పడ్డారు. రూ.4.50 లక్షల నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించారు. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి షట్టర్లను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనాస్థలానికి ప్రొబెషనరీ ఎస్పీ సాయికుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
