Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 6:23 pm Posted by : ramakrishna

మార్కేట్ యార్డులో దొంగలు పడ్డారు…

 

. . . రైతుల పసుపును దొంగిలించిన మూడు దుకాణాల కార్మికులు

 

. . . రెండు దుకాణాల కమీషన్ ఏజేంట్ల కు నోటీసులు

 

. . . చర్యలకు మీనా మేషాలు లెక్కిస్తున్న పాలకవర్గం?

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టలేడు అనేది నానుడి. ఇప్పుడు నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డులో పసుపు రైతులకు ఇంటిదొంగలు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నారు. పసుపును కాంటా కోసం తీసుకువచ్చిన సరుకులను మార్కేట్ యార్డులో దుకాణాదారులు (అడ్తీ) కమీషన్ దారులు/వ్యాపారులు దోచేస్తున్నారు. తమ వద్ద పని చేసే కార్మికుల ద్వార దొంగతనం చేయిస్తున్నారు. శనివారం మార్కేట్ యార్డులో నలుగురు దుకాణం దారుల వద్ద పసుపును ఉంచిన రైతుల సరుకు దొంగలపాలైంది. దొంగతనం చేసింది బయట వ్యక్తులు కాదు కమీషన్ ఏజెంట్ల వద్ద పని చేసే చాటా కార్మికులే. రైతులు పసుపును బస్తాలలో నింపుకు వస్తారు కానీ తూకం వేయరు. నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డులో ధర నిర్ణయం తరువాతనే కాంటాలు వేస్తారు. అప్పటి వరకు దడువాయి, చాటా కార్మికులు సరుకులను యార్డులో ఆరబెట్టడం, సంచులను నింపడం వారి పని.  రైతులు పసుపును వేలం కోసం ఉంచినప్పుడు రాత్రిపూట దొంగతనం మార్కేట్ యార్డులో నిత్య దొంగతనం జరుగుతుంది. రైతులు కూడా తాము తెచ్చిన సంచులలో ఎన్ని కిలోలు ఉన్నది పట్టించుకోరని, చాటా కార్మికులు అందులో నుంచి 30 నుంచి నలభై బస్తాలు తూకం కోసం తెస్తే వాటిలో నుంచి రెండు మూడు చాటాల పసుపును తస్కరించడం అక్కడ నిత్యక్రుత్యం. అలానే శనివారం రాత్రి రైతులు తీసుకువచ్చిన పసుపు చోరికి గురైంది.

 

Thieves broke into the market yard...

 

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో పసుపు చోరికి గురైన ఘటన కలకలం రేపుతోంది. 60 సీసీ కెమెరాలు ఉండగా, 44 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్న చోట రైతులు మార్కేట్ కు తీసుకువచ్చిన సరుకులు చోరికి గురికావడం సంచలనం రేపింది. ఏకంగా అరవై కిలోల పసుపును కార్మికుల ముసుగులో చోరి చేశారు. పసుపు కుప్పల నుంచి సరుకును చోరి చేసి దాచేసిన వైనం సీసీ కెమోరాలో నిక్షిప్తమైంది. అది నిత్యం జరిగే వ్యవహారమైనప్పటికి మార్కేట్ యార్డుకు రెండు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో రైతులు గమనించి నిలదీయడంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది. ఆరుగాలం పసుపు పండించిన రైతులు మద్దతు ధర దక్కడం లేదని బాదపడుతుంటే, పశ్చిమాసీయాలో యుద్ధమేఘాలతో ఎగుమతులు లేవని కొనుగోళ్లు నిలిచిపోయాని ఆవేదనతో ఉంటే మార్కెట్ యార్డులో పసుపు దొంగలతో రైతులు బేజారు అవుతున్నారు. ప్రతి సీజన్ లో పసుపు దొంగతనం రివాజుగా మారింది. గత ఏడాది మార్కేట్ యార్డులో పసుపు చోరి వ్యవహరం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆనాడు కట్టడి చేయలేక పాలకవర్గం చేతులేత్తేసింది.

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డులో మూడు దుకాణాదారులు/ అడ్తిదారుల సముదాయం వద్ద కుప్పగా పోసిన పసుపు చోరికి గురైన ఘటన లో అదికారుల స్పందన పలు అనుమానాలకు తావిస్తుంది. సీసీ కెమోరాలో పసుపు దొంగతనం పుటేజీ లభ్యమైన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంతే గాకుండా సంబంధిత యాజమాన్యాలకు కంటి తుడుపు చర్యగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ విషయంపై పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది అని అధికారులు చెబుతున్నారు. అది కుడా పాలకవర్గంకు కేవలం వారం నుంచి 10 రోజుల పాటు కొనుగోళ్లు చేయకుండా సస్పెన్షన్ వేటు వేస్తారని చెబుతున్నారు. గతంలో దొంగతనాలు చేసిన వారిపై కూడా ఇలా కంటితుడుపు చర్యలు తీసుకోవడం వలననే ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పాలి.