ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగల పట్టివేత
నలభై ఎనిమిది గంటలలో పట్టివేత పట్టుబడిన చోరులు పాత నేరస్తులే నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని నాందేవ్ వాడలో సాయి బాలాజీ ట్రాన్స్ పోర్టులో చోరీకి పాల్పడిన దొంగలను నలబై ఎనిమిది గంటలలో పట్టుకున్నట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి మాట్లాడుతు.. ఈ నెల 6న తెల్లవారుజాము ప్రాంతంలో నాందేవ్ వాడలోని సాయి బాలాజీ ట్రాన్స్ పోర్ట్ లో దొంగలు తలుపు...