నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బ్యాంకు షట్టర్స్ ను గడ్డపారతో పగులగొట్టి బ్యాంకులో అక్రమంగా ప్రవేశించి, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, నేరానికి పాల్పడానికి ప్రయత్నించిన దొంగకు ఏడు, ఐదేళ్ల చొప్పున రెండు జైలు శిక్షలు విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కనక దుర్గ గురువారం తీర్పు చెప్పారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఆలూరి సంతోష్ రెడ్డి బతుకు తెరువు కోసం తన బంధువులు ఉండే ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. అతనికి గతంలో దొంగతనాలు చేసే అలవాటు ఉంది. ఆర్థిక స్థోమత అంతంతే ఉండటంతో అప్పుడప్పుడు దొంగతనాలకు పాల్పడేవాడు. 01 జనవరి, 2024 న బైక్ పై గడ్డపార పెట్టుకుని దుబ్బాక గ్రామ నడిబొడ్డున ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బ్రాంచ్ శట్టర్స్ ను గడ్డపారతో పగులగొట్టి పైకి లేపి, బ్యాంకులోకి అక్రమంగా ప్రవేశించి, సిసి టీవి ద్వoసం చేసి,స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ ను కూడా ద్వo సం చేశాడు. బయట అలికిడి విని లోపలే దాక్కున్నాడు. బ్యాంకు లోపల ఏమో జరుగుతున్నదని గ్రామస్థుల సమాచారం మేరకు బ్యాంకు మేనేజర్ రాజు పోలీస్ 100 కు దయల్ చేసి సమాచారం ఇచ్చాడు. అలర్ట్ అయిన ధర్పల్లి పోలీసులు దుబ్బాక గ్రామానికి చేరుకుని బ్యాంకు ముందు నిలబడి చదిచప్పుడు కాకుండా లోపలికి వెళ్లి మూలన నక్కిన సంతోష్ రెడ్డిని రెడ్ హడెడ్ గా పట్టుకున్నారనే నేరఆరోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో ఇండియన్ పినల్ కోడ్ లోని మూడు సెక్షన్స్ లలో నేర నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఒక సెక్షన్ కు గాను ఏడు సంవత్సరాల జైలుశిక్ష, మరో రెండు సెక్షన్ లలో ఐదు సంవత్సరాల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ జడ్జి కనక దుర్గ తీర్పు విలువరించారు. ఒక సెక్షన్ కు వేయి రూపాయల చొప్పున మొత్తం మూడు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వ్రాశారు. శిక్షలన్ని ఎకకాలంలో అనుభవించడానికి వీలు కల్పించారు.