Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 5:20 pm Posted by : ramakrishna

వాహనాల తనిఖీ లో పట్టుబడ్డ దొంగ

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక దొంగ పట్టుబడినట్టు నందిపేట ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చీమ్రాజ్ పల్లి శివారు కెనాల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే అతనిని పట్టుకుని విచారించగా అతని పేరు సాయిలు అని, ఆటో నడుపుతూ ఉంటానని, చుట్టుపక్కల ప్రాంతాలలో, గుడిలలో, ఇండ్లలో దొంగతనాలు చేశాడని తెలిపారు. అనతంరం అతని దగ్గర నుంచి 12 గ్రామలు బంగారం, 22 గ్రాముల వెండి, ఒక పల్సర్ బైక్ (ఏపీ15బీఈ1126) ను స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. ఈ తనిఖీలు నిర్వహించిన ఎస్సై రామ్, మల్లేష్, నరేందర్, సుదర్శన్, అనిల్ లను సీఐ జాన్ రెడ్డి అభినందించారు.