. . . కేటిఆర్ అరెస్టు ఓక హైడ్రామా
. . . అల్లు అర్జున్ విషయాలపై చర్చిస్తారు గాని ప్రజా సమస్యల పట్టింపేది
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి , నియోజకవర్గన్ని అవినీతి రహితంగా, అభివృద్ధి దిశగా నడిపించాలానే సంకల్పంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలు వినిపించాలనుకుంటే సమయం ఇవ్వకుండా సభ సమయాన్ని వృధా చేసి, అనవసర విషయాల పైన చర్చ పెట్టారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. బిజేపి పార్టి జిల్లా కార్యాలయంలో మంగళవారం ధన్ పాల్ సూర్యనారాయణ విలేఖరులతో మాట్లాడుతు…అసెంబ్లీ సమావేశాలు అంటేనే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే శాసనాలు రూపొందించడం, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు ఏమి అవసరం ఉన్నాయో వాటిని చర్చించడం లాంటివి లేవని బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే అసెంబ్లీ నిర్వహించినట్లు ఉందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య దోస్తీ ఎలా ఉందంటే నువ్ కొట్టినట్టు చెయ్, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్లు ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.కేటిఆర్ అరెస్ట్ ఓ డ్రామా, హైడ్రా ఓ డ్రామా,ముసి ఒక పెద్ద కుంభకోణం, విజయోత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేసి ప్రజలను మబ్బే పెట్టమని అనుకుంటున్నారు. కాని సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా .. రాజీనామా చేస్తారో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పైన అర్ధ గంట చర్చ పెట్టి మాట్లాడే సమయం ఉంది కాని గురుకులాల్లో విద్యార్థులు కల్తీ ఆహారంతో చనిపోతే నోరు మేధపడు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చర్చ పెట్టడు, హైడ్రా బాధితురాలు బుచ్చవ్వ చనిపోతే చలనం లేదు, సొంత ఊరిలో మాజీ సర్పంచ్ చనిపోతే నోరు లేవదని,హిందువుల గుడుల పైన, దేవి దేవతల పైన దాడులు జరిగితే ఇప్పటికి సోయి లేదని, మరి ఓ ఓర్గం పైన అంత ప్రేమ ఏంటో అని మండిపడ్డారు. నిజామాబాద్ డేవలప్ మెంట్ కోసం మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డితో కలిసి సీయంను కలిసి నిధుల విడుధలకు వినతి పత్రం అందించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
