Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2025, 7:47 pm Posted by : ramakrishna

భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలి

. . . నూతన మండల అధ్యక్షులకు ఎంపి అర్వింద్ ఉద్బోద

నిజామాబాద్, బతుకమ్మ:

నూతనంగా ఎన్నికైన వివిధబిజేపి మండలాల అధ్యక్షులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను మర్యదాపూర్వకంగా హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసారు.. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురావేయడమే తమ లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ , ఆర్మూర్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ , పైడి రాకేష్ రెడ్డి , బిజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ,నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షులు నాగరాజు, ఇప్పకాయల కిషోర్, బాలాపురం ఆనంద్ రావు, గడ్డం రాజు, తారక్ వేణు గోపాల్, మెట్టు విజయ్ కుమార్, ఆర్మూర్, భీంగల్ నూతన మండల అధ్యక్షులు తదితరులకు నియమాక పత్రాలను అందచేశారు.

They should do their best for the growth of Bharatiya Janata Party