రైతుల పేరిట ధాన్యం అని చెప్పి బోనస్ నొక్కేశారు
రైస్ మిల్లర్లు, పోచారం తనయుడు కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడ్డారు రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు... బాన్సువాడ, బతుకమ్మ : రైతుల పేరున ధాన్యం అమ్మినట్లు కొందరు రైస్ మిల్లర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డిలు కుమ్మక్కై ప్రభుత్వం ఇచ్చిన బోనస్ డబ్బులను నొక్కేశారని రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు...