Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 5:08 pm Posted by : ramakrishna

చేయి చేయి కలిపారు.. సహకారం అందించారు..

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన బుర్ర వినోద్ గౌడ్ కు గత 16 రోజుల క్రితం బాబు పుట్టాడు. ఆ బాబు తక్కువ బరువుతో 8 నెలలకే పుట్టిన కారణం వలన హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని పేర్కొన్నారు. వైద్యం ఖర్చులకు సుమారు రూ.లక్ష  ఖర్చు అవుతుందని  వైద్యులు తెలుపడంతో  విషయాన్నీ  వినోద్ తన మిత్రుడు అయినా నలిన్ ఇల్లెందుల తెలుపగా వారు చదువుకున్న మోర్తాడ్  ప్రభుత్వ జూనియర్&డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్ధి నాయకులు నలిన్ ఇల్లెందుల వాట్సప్ స్టేటస్ ల ద్వారా  పూర్వ విద్యార్థులను,  అధ్యాపకులను సహాయం కోరారు. తద్వారా విద్యార్థులు,అధ్యాపకులు సానుకూలంగా స్పందించి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలా జమ చేసిన  రూ. 11,000  మిత్రుడు వినోద్ నలిన్ ఇల్లెందుల అందచేశారు.