డ్రైవింగ్ చేశారు.. శిక్ష అనుభవించారు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ద్విచక్ర వాహనాలు నడిపిస్తున్న మైనర్లకు కోర్టు శిక్ష విధించింది. వాహనాలు నడుపుతున్న 9 మంది మైనర్లకు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మేజిస్ట్రేట్ నగరంలో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీ లు ప్రదర్శించాలని ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని సాయిరెడ్డి సిగ్నల్,పూలంగ్ చౌరస్తా,కాంటేశ్వర్,గవర్నమెంట్ హాస్పిటల్,కోర్టు చౌరస్తాలలో మైనర్లు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలలో పట్టుకొని ప్రదర్శించారు.