Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:48 pm Posted by : ramakrishna

కాంక్రీట్ తో ఎములాడ రాజన్న గుడి కడుతూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారు

 

. . . రాజన్న ఆలయాన్ని కృష్ణ శిలలతో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలి

 

. . . రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హిట్ జోడీ కాదు . . . ఇడుపు కాయితం జోడీ

 

. . . సిరిసిల్ల సెస్ లో జరిగిన రూ. 32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

వేములవాడ, బతుకమ్మ :  

వేములవాడ రాజన్న ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, చోళుల కన్నా ముందు నుంచే గొప్ప చరిత్ర ఉందని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన భార్య జాంబవతికి సంతానం కోసం ఇక్కడ కోడె మొక్కులు చెల్లించారని ఆనాటి నుంచే కోడె మొక్కుల సంప్రదాయం ప్రారంభమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా వేములవాడ ఆలయాన్ని కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేములవాడ గుడిని కాంక్రీట్ తో నిర్మిస్తున్నారు. దీనివల్ల ఆలయం ఎక్కువ కాలం నిలవదని, కృష్ణశిలతో ఆగమ శాస్త్ర ఆచారం ప్రకారం ఈ గుడిని నిర్మించాలని, కృష్ణశిల ఉంది, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్లు ఉన్నారని అయినప్పటికీ ఎందుకు కాంక్రీట్ తో నిర్మిసున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.కోడెలు చనిపోతే శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు కూడా చేయటం లేదని,ఇక్కడి ఎంపీ బండి సంజయ్ మాట్లాడితే హిందూత్వం అంటారు. కానీ వేములవాడలో కోడెలు చనిపోతుంటే పట్టించుకోవటం లేదని అన్నారు.  వేములవాడ ఆలయానికి రూ. 250 కోట్లు మేము ఇచ్చామంటే మేము అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు విమర్శలు చేసుకుంటున్నాయని, ఆలయానికి నిధులిచ్చిన విషయంలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

They are undermining the devotees' faith by constructing the Vemulavada Rajanna temple using concrete.
 

ఆలయ నిర్మాణం పనులు ఆలస్యమైనా సరే కృష్ణశిలతో వెయ్యి ఏళ్లు ఉండేలా నిర్మించాలని, ఇక వేములవాడలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఎక్కడ చూసిన దుమ్ము కనిపిస్తోందని, ఇక్కడ ఐదు కోట్లతో కట్టిన ఒక మార్కెట్ వృథాగా ఉండగా, మరొక మార్కెట్ సగం నిర్మించి వదిలేశారన్నారు. రుద్రమ చెరువు తీవ్ర దుర్గంధంతో అపరిశుభ్రంగా ఉందని, చెరువులను బాగు చేయాల్సిన హైడ్రా ఏం చేస్తుంది. పేదల ఇళ్లను కూల్చటమే హైడ్రా పనా? అని ఆమె ప్రశ్నించారు. గతంలో కేటీఆర్ మంత్రి ఉంటే సిరిసిల్లకు ఎక్కువ చేశారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్ విప్ గా ఉండి వేములవాడకు ఎక్కువ చేస్తూ సిరిసిల్లను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. నేత, చేనేత కార్మికులు సిరిసిల్లలో ఎక్కువగా ఉంటే వేములవాడలో యారన్ డిపో పెట్టారని, అధికార దర్పం చూపించుకోవటానికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.2018 మే లో అప్పటి నీటి పారుదల మంత్రి హరీష్ వచ్చి 4 నెలల్లో రుద్రంగి రిజర్వాయర్ పూర్తి చేస్తామన్నారని, కానీ పదేళ్లైనా ఇప్పటికీ అది పూర్తి కాలేదన్నారు. యువ సామ్రాట్ అని చెప్పుకునే కేటీఆర్ నియోజకవర్గంలో ఉన్న జేఎన్టీయూ కాలేజ్ లో ల్యబ్ లేదని జగిత్యాలకు పోవాలని, హాస్టల్స్ లేవని, ఇక ఎందుకు జేఎన్టీయూ పెట్టినట్లు అని కవి ప్రశ్నించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో సెస్ లో 32 కోట్ల అవినీతి జరిగిందని, సరిగ్గా ఎన్నికలకు ముందు అందులో అగ్నిప్రమాదం జరిగి ఆ ఫైల్స్ అన్ని కాలిపోయాయని ఇలా చాలా చోట్ల ఆధారాలు మాయం చేసేలా అగ్నిప్రమాదాలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఇక నేరెళ్ల బాధితులకు సంబంధించిన ఆధారాలను కూడా మాయం చేశారని, కచ్చితంగా సెస్ లో జరిగిన అవినీతి పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సిరిసిల్ల, వేములవాడ గతంలో ఎక్కువ మంది మావోయిస్టులు ఉన్న ప్రాంతమని, మాజీ మావోయిస్టులంతా కూడా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నానన్నారు. మా పార్టీ మీ సిద్దాంతాలతోనే పనిచేస్తోంది. అందుకే టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.

They are undermining the devotees' faith by constructing the Vemulavada Rajanna temple using concrete.