Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 7:20 pm Posted by : ramakrishna

రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు

  • రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన 
  • పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర ముఖ్య ఉద్దేశం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ,సంవిధాన్ అర్బన్ ఇంచార్జ్ సత్యనారాయణ గౌడ్ ,నుడా చైర్మన్  కేశ వేణు అన్నారు.  నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ని 23 వ డివిజన్ లో  జై బాబు జై భీమ్ జై సంవిధన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత  నగరంలోని పూలాంగులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు రాహూల్ గాంధీ, జాతీయ పార్టీ  అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

They are trying to undermine the Constitution.

పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.  గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుందన్నారు. ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉందని ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలోసంవిధాన్ అర్బన్  కో- ఆర్డినేటర్ శేఖర్ గౌడ్ ,నాయకులు రత్నాకర్   23 వ డివిజన్ ఇంచార్జ్  విజయ్ పాల్ రెడ్డి , నాయకులు ఆకుల శ్రీశైలం ,సాయి రెడ్డి ,సంపత్ ,రూపేష్ రెడ్డి, ఉషా,సంతోష్ ,మధు,ప్రమోద్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

They are trying to undermine the Constitution.