వెండిదొంగతనం కేసులో అక్రమంగా ఇరికిస్తామని బెదిరిస్తున్నారు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తాము పనిచేస్తున్న శ్రీ సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ యాజమాన్యం లోని అన్నదమ్ముల మధ్య విభేదాలు, దొంగ బంగారం కేసు ఉండటం వలన తమను వెండిచోరీ చేసారని తప్పుడు ఆరోపణలు చేసి పోలీసు కేసులలో ఇరికించాలని చూస్తున్నారని కన్నయ్య, ప్రశాంత్ అనే యువకులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ... నగరంలోని ధర్మకాంటా కాంప్లెక్స్ లోని సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ లో ఆరు సంవత్సరాలుగా రూ.6 వేల జీతంకు పనిచేస్తున్నామని తెలిపారు. ఇటీవల దీపావళి...