Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 7:39 pm Posted by : ramakrishna

వెండిదొంగతనం కేసులో అక్రమంగా ఇరికిస్తామని బెదిరిస్తున్నారు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తాము పనిచేస్తున్న శ్రీ సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ యాజమాన్యం లోని అన్నదమ్ముల మధ్య విభేదాలు, దొంగ బంగారం కేసు ఉండటం వలన తమను వెండిచోరీ చేసారని తప్పుడు ఆరోపణలు చేసి పోలీసు కేసులలో ఇరికించాలని చూస్తున్నారని కన్నయ్య, ప్రశాంత్ అనే యువకులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ… నగరంలోని ధర్మకాంటా కాంప్లెక్స్ లోని సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ లో ఆరు సంవత్సరాలుగా రూ.6 వేల జీతంకు పనిచేస్తున్నామని తెలిపారు. ఇటీవల దీపావళి పండగ సందర్భంగా తమ వేతనంను పనితీరును బట్టి రూ.15 వేలు పెంచాలని లేకపోతే మానివేస్తామని యజమానులకు తెలుపడం జరిగిందన్నారు. ఐతే తమకు వేతనం పెంచకపోగా దుకాణంలో 70 కిలోల వరకు వెండి చోరీ చేశారని గతనెల 9న రాత్రి వరకు తమ షాపు ఓనర్ చితకబాదడని ఆరోపించారు. తమవద్ధ ఉన్న మూడు సెల్ పోన్ లు, బైక్ ను లాక్కున్నారని, అంతే గాకుండా ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయించాడని అన్నారు. 14,15,16 తెదిలలో స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారని తెలిపారు. అక్కడ పోలీస్ కానిస్టేబుళ్లు తమను విపరీతంగా కొట్టారని తెలిపారు. ఇప్పుడు తమపై వెండి దొంగిలించారని కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని, సీసీ టీవీ పుటేజీలను పరిశీలించాలని అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తు, తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్న యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.