అడ్డొస్తే అంతు చూస్తున్నారు
బిచ్కుంద మండలంలో బరితెగిస్తున్న ఇసుక మాఫియా వీఆర్ఏల పై దాడులు బతుకమ్మ, బిచ్కుంద : ఇసుక మాఫియా బరి తెగించింది. మంజీర నదిలో నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను యధేచ్చగా తరలిస్తోంది. అడ్డు చెప్పే వీఆర్ఏలపై దాడులు చేస్తుండటంతో వారు చూసి చూడనట్లు ఉండాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మంజీరా పరివాహక గ్రామాలైన షట్లూరు, ఖాత్గావ్, హాగుల్ గ్రామాల పరిధిలో నుంచి ప్రతిరోజు చీకటి పడిందంటే చాలు తెల్లవారుజాము వరకు వందలాది ట్రాక్టర్ల లో ఇసుక తరలించడం మామూలు విషయంగా మారింది....