Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 6:09 pm Posted by : ramakrishna

జై తరుణ్, సునీతలను అభినందించిన తెయూ వైస్ ఛాన్స్ లర్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబడిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్  జై.తరుణ్, తెలంగాణ    కాంటింజెంట్ లీడర్  డాక్టర్ ఎం.సునీతను  విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరి రావు,  రిజిస్ట్రార్  ఆచార్య ఎం.యాదగిరి అభినందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ దేశ అత్యున్నత స్థాయి  కార్యక్రమంలో పాల్గొనడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని  తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.