డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి రావు మంగళవారం సీఎం రేవత్ రెడ్డిని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వీసీకి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో మోడల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సరైనన ప్రణాళికతో వస్తే నిధులు మంజూరు చేసి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులున్నారు.