Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 5:56 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లా లో జడ్పిటిసి, ఎంపీపీ ల రిజర్వేషన్  లు ఇవే

కామారెడ్డి, బతుకమ్మ :

 కామారెడ్డి జిల్లాలో 25 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.  శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థలు జడ్పిటిసి, ఎంపీపీ  2025 షెడ్యూల్ ఖరారు నేపథ్యంలో రిజర్వేషన్ల జాబితా వెలువరించారు. కామారెడ్డి జిల్లాలో  25 జడ్పీటీసీ స్థానాలకు గాను బీసీలకు 11, జనరల్ 09, ఎస్సీ 3, ఎస్టీలకు 2 స్థానాలు కేటాయించారు. 25 మండల పరిషత్ స్థానాలకుగాను బీసీలకు 11, జనరల్ 8, ఎస్సీలకు 4, ఎస్టీలకు 2 స్థానాలు కేటాయించారు.

These are the reservations for ZPTC and MPP in Kamareddy district.