Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 1:41 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన ఇద్ధరు సీఐలు

. . . మర్యాధ పూర్వకంగా ఎసిపిని కలిసిన కోత్త సీఐలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో  ఇద్ధరు సిఐలు భాధ్యతలు స్వీకరించారు. గురువారం రాత్రి నియమితులైన ఓకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, నిజామాబాద్ నగర సీఐ గా శ్రీనివాస్ రాజ్ లు శుక్రవారం ఉదయం భాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సీసీఆర్ బి సీఐ గా ఉన్న శ్రీనివాస్ రాజ్  నగర సిఐ గా , అలాగే హైదరాబాద్ ఐ జి కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి నగరంలోని ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓగా నియమితులు కాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న విజయ్ బాబు, నరహరీల నుంచి భాధ్యతలను స్వీకరించారు. ఇరువురు సీఐలు బాధ్యతల స్వీకరణ తరువాత  నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిశారు.