స్టెతస్కోప్ పట్టేది లేదు.. పరీక్షించేది లేదు..
ఓపీ సేవలలో ప్రొఫెసర్లు ఎక్కడ..? అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల గైడెన్స్ ఏది..? ఓపీ సేవలన్నీ ఎస్ఆర్ లు, పీజీ విద్యార్థులే గాడి తప్పిన జీజీహెచ్ పాలన నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలు నానాటికి తీసికట్టుగా మారుతుంది. ఒకప్పుడు ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం (వరంగల్) ఆసుపత్రుల తర్వాత అత్యధిక వైద్య సేవలు అందిన నిజామాబాద్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షలా మారుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నాల్గవ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ...