Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 8:22 pm Posted by : ramakrishna

దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా

 

ఢిల్లీ, బతుకమ్మ : దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ర్టాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.ఆయా రాష్ర్టాలకు వున్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. డిలిమిటేషన్ కమిషన్ యాక్టే ఇంకా రాలేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే తమిళనాడులో కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. డిలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ను తీసుకువస్తామని తెలిపారు. పార్లమెంటులో డిలిమిటేషన్ యాక్ట్ పై చర్చిస్తామని, పూర్తి స్థాయి చర్చ తరువాతే చట్టం చేసి పునర్వభిజన కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.