Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 3:07 pm Posted by : ramakrishna

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు

 

. . . డివిజన్లలో నూతన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

ఇందూరు, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో 23, 24, 6, 48వ డివిజన్ ల లో రోడ్డు పనులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇటీవల జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు రూ.20 లక్షలు కేటాయించారన్నారు. ఈ నిధులతో ప్రతి డివిజన్ అభివృద్ధి పనులు కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఖిల్లా రామాలయం అభివృద్ధిలో భాగంగా రోప్ వే కు సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమవుతుందని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నియోజకవర్గం లో నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని. గత మూడు సంవత్సరాలుగా సీడీపీ నిధుల కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, సుమిత్ర కిషోర్, విజయ మల్లేష్ యాదవ్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

There will be no compromise on the quality of development works