Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 2:47 pm Posted by : ramakrishna

ఎరువుల కొరత లేకుండా చూడాలి

  • రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో 15.00+33.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం(గిడ్డంగి)ని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీమ్ రావు, సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్లమెంటు దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ ఎంపిపి అక్కపల్లి సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

There should be no shortage of fertilizers