Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 7:33 pm Posted by : ramakrishna

యూరియా సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలి

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : యూరియా డిస్ట్రిబ్యూషన్  చిన్న, సన్నకారు రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి పట్టణంలో గల మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్ లో యూరియా పెస్టిసైడ్స్ స్టాక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా  సక్రమంగా ఇచ్చేటట్టు చూడమన్నారు.  యూరియా  మన జిల్లా రైతులకు మాత్రమే అందేటట్టు మన జిల్లా చెక్పోస్టులలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. మన జిల్లా యూరియా  పక్క డిస్ట్రిక్ట్ కి వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, నానో యూరియా రేటు తక్కువ ఉండటంతో పాటు  45 కిలోల యూరియా బస్తాకు సమానంగా  500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని నానో యూరియా రవాణాకు  అదనంగా రవాణా ఖర్చులు కూడా ఉండవు, డ్రోన్ ద్వారా సులభంగా పిచికారి చేయవచ్చు కాబట్టి  యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం వారు వారి యొక్క సొసైటీల ముందు ఎక్కువ జనం ఉండకుండా  ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటన చేస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలని సూచించారు. రైతు యొక్క పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలని సూచించారు.  మరియు ప్రైవేట్ షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా సబ్సిడీ యూరియా  పక్కదోవ పట్టకుండా అనగా ఇండస్ట్రీస్కు, గాని ప్లైవుడ్ ఇండస్ట్రీస్ గాని పెయింట్ ఇండస్ట్రీస్ గాని వెళ్లకుండా అధికారులు పరిశ్రమలను సర్ప్రైజ్ విజిట్స్ చేయమని సూచించారు.

There should be no problem in urea supply