Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 6:28 pm Posted by : ramakrishna

కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

. . . కోటగిరి పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సీపీ

 

కోటగిరి, బతుకమ్మ :

 

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గురువారం మధ్యాహ్నం సీపీ కోటగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పని తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతలు పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు అందజేశారు. కోటగిరి పీఎస్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్మెంట్ చేయాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే అధికారులు, సిబ్బంది తమ హెడ్ క్వార్టర్స్ లో 24 గంటలు అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి పి.శ్రీనివాస్, రుద్రూర్ సీఐ క్రష్ణ, కోటగిరి ఎస్సై జి.శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

 

There must be a special plan of action to solve the cases.