సరిహద్దుల రాకపోకలపై ఎల్లప్పుడు నిఘా వ్యవస్థ ఉండాలి
. . . మెండోరా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ మెండోరా, బతుకమ్మ: మెండోరా పోలీస్ స్టేషన్ సరిహద్దులో నిర్మల్, మెట్ పల్లి ప్రాంతాలు ఉన్నందున సరిహద్దుల రాకపోకలపై ఎల్లప్పుడు నిఘా వ్యవస్థ ఉండాలి అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెండోరా పోలీస్ స్టేషన్ ను సిపి సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, నేర పరిశోధన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచించారు. ...