Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 4:55 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది

బతుకమ్మ,ముప్కల్: ప్రతి ఒక్క విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని సరైన క్రమంలో శిక్షకుల ఆధ్వర్యంలో తర్ఫీదు ఇచ్చినట్లయితే పిల్లల్లోని సృజనాత్మక శక్తి బయటపడుతుందని పాఠశాల చైర్మన్ సాయిరెడ్డి అన్నారు. ముప్కల్ మండలం రెంజార్ల గ్రామంలోని విజ్ఞాన్ పాఠశాలలో నిర్వహించిన  సమ్మర్ క్యాంప్ లో భాగంగా పిల్లలు భరతనాట్యంలో తర్ఫీదు పొందారు. తాము నేర్చుకున్న  నృత్య ప్రదర్శనను  పిల్లలు శనివారం పాఠశాల ఆవరణలో ప్రత్యేక దుస్తులతో అలంకరించుకొని భరతనాట్యం ప్రదర్శించడం జరిగింది. తమ పిల్లలు చేసిన నాట్యం చూసిన తల్లిదండ్రులు మంత్రముగ్ధులను చేసిందని ఆయన పేర్కొన్నారు. క్లాసికల్ డాన్స్ తో పాటు వాలీబాల్, కబడ్డీ, చెస్, క్యారం, చిత్రలేఖనం, చేతిరాత నైపుణ్యం తదితర అంశాలలో 20 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సోహెల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

There is talent hidden in everyone.