- ఎస్సి రిజర్వేషన్ 15 నుండి 18శాతం పెంచాలని తీర్మానం చేసిన అమలు జరగలేదు
- మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు
- రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన కుల వివక్ష ఉందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. జిల్లా మాల సంఘం అధ్యక్షులు చొక్కం దేవిదాస్, కన్వినర్ అలుక కిషన్ ల ఆధ్వర్యంలో మాలల ఐక్య సదస్సు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సదస్సు దివంగత నేత గడ్డం వెంకట స్వామి(కాకా) జయంతి ఉత్సవం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనా మంత్రి వివేక్ వేంకట స్వామి మాట్లాడుతూ… హైదరాబాద్ లో జరిగిన మాలల గర్జన వల్ల మాలల్లో ఐక్యత పెరిగిందని, దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ అంతా పెద్దగా జరగటం అదే మొదటిసారి అన్నారు. మాలల కోసం పోరాటం చేస్తుంటే.. కొందరు కుట్రలు చేసి.. సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేశారు అన్నారు. ఆనాడు ఎస్సీ రిజర్వేషన్ 15 నుండి 18శాతం పెంచాలని తీర్మానం చేసాం.. కానీ జరగలేదన్నారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగింది. పోరాడితేనే ఫలితాలు వస్తాయి అని పిలుపు నిచ్చారు. దేశంలో ఇంకా కులవివక్ష ఉందని అందుకే మాల ఉద్యోగులకు వేధింపులు తప్పటం లేదు అని అవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.. అయిన నా మీద కావాలనే విమర్శలు చేస్తున్నారు అన్నారు. మంత్రి లక్ష్మణ్ అంశంలోను అనవసరంగా నా పేరు ప్రచారం చేశారు అని గుర్తు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకా.. మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు. నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ నన్ను విమర్శలు చెస్తున్నారు అని తెలిపారు. నాకు మంత్రి పదవి మీద మోజు లేదు.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్ట పడుతున్నాం అని తెలిపారు. నేను ఇంచార్జ్ అయ్యాక జూబ్లీ హిల్స్ లో ఓటింగ్ శాతం పెరిగింది. ఒక వర్గం మీడియా కావాలనే నన్ను టార్గెట్ చేసాయి. నేను నిజాయితీగా ఉన్నాను..నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్నాను. మాలలు అంతా కలిసి ఉండాలని కోరారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.నాగరాజు మాట్లాడుతూ.. మాలల వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాడుతూనే వస్తున్నామని ఇందుకు అన్ని కుల సంఘాలు సహకరించి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. తాను ఐపీఎస్ గా పోలీసు పూర్తిచేసిన సమయంలో ఎంతో ఆప్యాయతగా తన విధులకు ఆటంకం కలిగించకుండా పనిచేశానని గుర్తు చేశారు. కానీ రాజకీయాల్లో కుల వివక్ష కొనసాగుతుందని దీనిపై పోరాడాలని ఇందుకు మన ఐక్యత మన కార్యచరణ కోసం పోరాటం కొనసాగించాలని అన్నారు. కాకా వెంకటస్వామి కులం మతం అనే వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేవారని వారి అడుగుజాడలో నడుస్తున్న ఆయన తనయుడు వివేక్ వెంకటస్వామి ఆశయ సాధనలో మనమందరం ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. అనంతరం ఇటీవల గ్రూప్ వన్, గ్రూప్ 2లో విజయం సాధించిన అభ్యర్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, నాయకులు దయానంధ్, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
