మోర్తాడ్, బతుకమ్మ: సహకార సంఘంలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని మోర్తా వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలం లోని శెట్ పల్లీ సొసైటీ పరిధిలోని శెట్పల్లి , మోర్తాడ్ సొసైటీ పరిధిలోని మోర్తాడ్ రైతులకి యూరియా సరఫరా చేయడం జరిగిందని రైతు లకు అవసరానికి సరిపడా యూరియా అందించడం జరుగుతుంది. కావున రైతులు ఎవరు అవసరానికి మించి యూరియా తీస్కొని కృతిమ కొరత సృష్టిచోదని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మండలానికి 2205 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని ప్రతిరోజూ మండలానికి 40 నుండి 60 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరుగుతుంది. కావున రైతులు ఎవరు యూరియా విషయంలో ఇబ్బంది పడొద్దని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ పోతుగంటి భూమేశ్వర్, రైతులు గంగాధర్, అజయ్, గున్నాల ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.