Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 8:23 pm Posted by : ramakrishna

రామాలయ స్థలం జోలికొస్తే ఊరుకునేది లేదు

. . . స్థలం వద్దకు జేసిబి తీసుకురావడం ఎంతవరకు సమాంజసం..

 

. . . రామాలయ స్థల విషయం పై వాగ్వివాదం…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సోమవారం సీతారాముల చిత్ర పటానికి పూజలు చేస్తున్న స్థల ప్రాంతాన్ని అధికారులు జేసీబితో చదును చేయడానికి ప్రయత్నించగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. రామాలయ స్థలం జోలికొస్తే ఊరుకునేది లేదని అన్నారు. రామాలయానికి చెందిన స్థల విషయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులేమాన్ నగర్ గ్రామంలోని రామాలయ స్థలానికి సంబంధించి ఒక ఎకరం 15 గుంటల భూమి ఉందని, ఈ స్థలంలో 1997 వ సంవత్సరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం అడుగగా, గ్రామ పెద్దలు అంగీకరించడంతో హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టారని అన్నారు. రామాలయ స్థల విషయంపై తహశీల్దార్ ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడికి విచ్చేసి ప్రభుత్వ బోర్డు, జెసిబి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ భూమి ధరణిలో కోటయ్య పేరు మీద ఉందని పేర్కొన్నారు. సర్వే నంబర్, పహాని కూడా ఉందని, 2018 లో కొత్త పాసు బుక్కులు వచ్చినప్పుడు రామాలయం పేరుతో ఎండోమెంట్ లో అడ్మిట్ చేయడం జరిగిందని చెప్పారు. ధరణిలో రామాలయం స్థలానికి సంబంధించిన పత్రాలు ఉంటాయని, అవేమీ చూడకుండా, ఎలాంటి పత్రాలు తీసుకురాకుండా డైరెక్ట్ గా ఇక్కడికి విచ్చేసి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేస్తామని, జెసిబి తీసుకువచ్చి రామాలయాన్ని కూల్చివేస్తామని, మాకు కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయని అధికారులు హిందూవులపై అనగా తొక్కే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయం పై రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ స్థలం రామాలయానికి సంబంధించిందని రామాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామాలయ స్థల విషయంపై రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

 

There is no peace when it comes to the Ram Temple site.
There is no peace when it comes to the Ram Temple site.
There is no peace when it comes to the Ram Temple site.
There is no peace when it comes to the Ram Temple site.