యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు
. . . మండల వ్యవసాయ అధికారి మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులకు ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సమానంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలో మొత్తం 8,200 మంది రైతులు ఉండగా, జూన్ 10 నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 4,033 మంది రైతులు...