Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 12:07 pm Posted by : ramakrishna

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలను పట్టించుకునే పరిస్థితి లేదు :  కిషన్ రెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం

హనుమకొండ, బతుకమ్మ : హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నాయని విమర్శించారు.  పేదలను పట్టించుకోనందుకే బీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. 2014 తర్వాత పోరాటం చేసే వారు లేకుండా  తమకు మద్దతుగా ఉన్నవారినే బీఆర్ఎస్ పార్టీ ఎంచుకుందని ఆరోపించారు.