Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 8:25 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యం తగదు

 

. . . నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

జనగాం, బతుకమ్మ :

 

ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావాల్సి ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి, ఆలేర్, జనగాం మార్కెట్ యార్డులోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిజెపి చేపట్టిన బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని తెలిపారు.

 

There is no need to be careless in purchasing grain.

 

రాష్ట్రంలోని పలుచోట్ల సుమారు 40 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది అన్నారు. అనేకచోట్ల రైతులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారని పేర్కొన్నారు. తాము వెళ్తున్న మార్కెట్ యార్డ్ పేరును తెలుసుకొని ముందస్తుగానే లారీలను పంపుతున్నారన్నారు. ప్రభుత్వం ఇలాగే స్పందిస్తుందంటే తాము గ్రామ గ్రామాన వెళ్లి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఒకవైపు వాతావరణ శాఖ ఎండలపై హెచ్చరికలు జారీ చేస్తే…రైతులు మాత్రం అదే ఎండలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు.

 

There is no need to be careless in purchasing grain.