Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 5:18 pm Posted by : ramakrishna

అక్రమ కేసులకు భయపడేది లేదు..

  • డీసీసీబీ డైరెక్టర్, మెండోరా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి

 

ముప్కాల్, బతుకమ్మ: అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక నియంత పాలన కొనసాగుతుంది అని డి సి సి బి డైరెక్టర్ మెండోరా మండల పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి అన్నారు. ముప్కాల్ మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు జోగు నర్సయ్య కాంగ్రెస్  ప్రభుత్వ హామీలపై, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి అక్రమాలను సోషల్ మీడియాలో  ప్రశ్నించినందుకు ఆయనకు పోలీసులు  నోటీసు లు జారీ చేయడాన్ని నిరసిస్తూ గురువారం నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ కలిసి జోగు నర్సయ్య కు మద్దతుగా ముప్కాల్  పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నాగం పేట్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సునీల్ రెడ్డి చేస్తున్న ఆగడాలను ఎత్తి చూపుతున్న నియోజకవర్గ బీ ఆర్ ఎస్ నాయకులు జోగు నర్సయ్య పై కేసులు పెట్టి పోలీసు స్టేషన్ కి రావాలని వేధిస్తున్నారు అని దీన్ని మేము ఖండిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ నాయకులం అందరం స్టేషన్ కు రావడం జరిగింది అన్నారు.

There is no fear of illegal cases..