అక్రిడిటేషన్, మీడియా కార్డులకు తేడా లేదు
హైదరాబాద్, బతుకమ్మ : అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తుందని ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన టీడబ్ల్యు జేఎఫ్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్...