- మేము చూపిన ఖర్చుల్లో పాత బకాయిలు చెల్లించాం
- భీమ్ గల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్
భీమ్ గల్, బతుకమ్మ : మా పాలకవర్గం పరిపాలన సమయంలో అన్ని పనులు అందరు కౌన్సిలర్ల ఆమోదం మేరకు తీర్మానలను అనుసరించి చేశామని, చేసిన పనులన్నింటికి బిల్లులు ఉన్నాయని భీమ్ గల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ తెలిపారు. నిన్న కొంతమంది బిజెపి నాయకులు మున్సిపల్ లో 20-02-2022 నుండి 21-02-2025 వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వివరణ ఇస్తూ బ్లీచింగ్ పౌడర్ కు రూ.19 లక్షలు ఖర్చు చేసిన దాంట్లో అంతకుముందు జరిగిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఉన్న పాలక వర్గ పెండింగ్ బాకీ ని రూ.7 లక్షల చెల్లించడం జరిగిందని,మిగతా రూ.12 లక్షలు సంవత్సరానికి రూ.4 లక్షల చొప్పున 3 సంవత్సరాలకు బీచ్ పౌడర్ కు ఖర్చు చేయడం జరిగిందన్నారు. డ్రిల్లింగ్ బోర్లు రూ. 34 లక్షలు ఖర్చు చేసిండ్రు అని ఆరోపణ చేశారు. ప్రతి కౌన్సిలర్ కు కో ఆప్షన్ నెంబర్లకు అన్ని కలిపి రూ. 28 లక్షలు ప్రోసిడింగ్లు ఇవ్వడం జరిగిందని, మిగతారూ. 6 లక్షల ర చొక్కాయ గుట్టకు బోరు మోటర్,అయ్యప్పగుట్టకు బోరు మోటర్,బ్రహ్మంగారి గుట్ట,సంతోష్ నగర్ తండ దగ్గర బోరు మోటర్,కొత్త యూత్ రూమ్ దగ్గర బోరు మోటర్, జెసిబి,ట్రాక్టర్లు ఆటోలో రిపేరు రూ. 11 లక్షలు ఖర్చు చేశారని ఆరోపణ చేశారు.దాంట్లో నుండి పాతవి రూ.1,50,000 చెల్లించడం జరిగిందన్నారు.మిగతా 3 సంవత్సరాల జెసిబి రిపేరుకు కి రూ.4 లక్షల ఖర్చు, మిగతాది ఆటోలు పల్టీపడి పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయితే 1, ఆటోకు 80000 రూపాయలు 2 ఆటోకు 1.00000 రూపాయలు రెండు ఆటోల రిపేర్ ఖర్చు అవడం జరిగిందని, మూడు సంవత్సరాల ఆయిల్ చేంజ్, టైరు రకరకాల రిపేర్లు ఖర్చులు, ట్రాక్టర్ రిపేరు, ఆయిల్ చేంజ్,టైర్లు ఇలా అనేక రకాల ఖర్చులు రూ. 9 లక్షల 50 వేలు మూడు సంవత్సరాలు జెసిబి ట్రాక్టర్ ఆటోలకు రిపేర్ ఖర్చు చేయడం జరిగిందని, రూ. 4 లక్షలు,చెట్ల ఖర్చు రూ.15 లక్షల ఖర్చు జరిగిందని అని ఆరోపించడం జరిగింది దానికి వివరన ఇస్తూ పాతవి రూ. 3లక్షల, మిగతా ఒక్కొక్క కౌన్సిలర్ కిరూ. లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. మొరం ఖర్చు రూ. 16 లక్షలు ఖర్చు చేశారు అని ఆరోపించారు దానికి వివరణగా పాత బిల్లు రూ. 3 లక్షల చెల్లించడం జరిగిందని,మిగతారూ. 13 లక్షలు ప్రతి సంవత్సరానికి దసరా బతుకమ్మ గణేష్ ఉత్సవాలకు ముందుగా ఎక్కడైతే రోడ్లు చెడిపోయి, రామన కుంట చెరువు కట్ట పైన మొరం వేయడం జరిగిందని, ఒక్కొక్క సంవత్సరానికి రూ.2 లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు రూ.6 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగతా రూ. 7 లక్షల1వార్డులొ శర్మ నాయక్ ఇంటి నుంచి ఆర్ అండ్ బి రోడ్ వరకు నూతన మొరం రోడ్డు వేయడం జరిగిందని, రాజు నాయక్ ఇంటి నుండి మెండోరా మోహన్ ఇంటి వరకు మొరం రోడ్డు వేయడం జరిగిందని,శివాలయం రోడ్డు మొరం వేయడం జరిగిందని,షెడ్రాక్ పాస్టర్ ఇంటి నుండి నర్సరీ వరకు మొరం వేయడం జరిగిందని,బాపూజీ నగర్ కాలనీలో రెండుసార్లు మొరం వేయడం జరిగిందన్నారు.మొత్తం రూ.1కోటి 93 లక్షల ఖర్చు జరిగిందన్నారు. దానిలో నుండి పాత బకాయిలు రెండు సంవత్సరాలు రూ.65 నుంచి రూ.70 లక్షల ఖర్చు చెల్లించడం జరిగిందని మిగతా 3 సంవత్సరాల రూ.1 కోటి చిల్లర ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ పనులు,ఖర్చులు మొత్తం మునిసిపల్ పాలకవర్గం తీర్మానం ప్రకారం ఖర్చు చేయడం జరిగిందని, దీనిపై ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగిందని, మాపై అనవసరమైన ఆరోపణలు చేసి బురదజల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్నయ్ అనవసరంగా బిజెపి నాయకులు ఆరోపణలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఈ ప్రయత్నం మానుకోవాలని మరి మున్సిపల్ ఐదు సంవత్సరాల పాలనలో మూడు సంవత్సరాల పాలన పైనే ఆరు కోణాలు చేస్తున్నారు అంతకు ముందు జరిగిన రెండు సంవత్సరాల పాలనలో జరిగిన ఖర్చులు అభివృద్ధిలో పైన కూడా వివరణ బిజెపి మిత్రులు ఇస్తే పాత బిల్లులు ఎన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాము తెలుస్తుందని ఇతవు పలికారు.ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, డీసీసీ డెలికేట్ కుంట రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జె జె నర్సయ్య,మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పర్స అనంతరావు తదితరులు పాల్గొన్నారు.