Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 4:36 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు

  •  బ్లాక్ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు కార్తీక్

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు ఉండవని బ్లాక్ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు కార్తీక్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రుద్రూర్ మండలం తరపున నితిన్ పటేల్ ను యువజన విభాగం అధ్యక్షుడు, అత్కురి మహేష్ ను ఉపాధ్యక్షుడిగా మద్దతు తెలిపి ఇద్దరు సమన్వయంతో పని చేస్తారని చెప్పారు. రుద్రూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నితిన్ పటేల్, ఉపాధ్యక్షులుగా అత్కూరి మహేష్ లను నియమించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా అందరు కలిసికట్టుగా ఏకాభిప్రాయంతోనే ఒకే తాటిపై ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.